అనుష్క శెట్టి ఏడాదికి ఒకటి లేదా రెండేళ్లకు ఒక సినిమా చేస్తోంది. “బాహుబలి 2” విడుదలైన తర్వాత “సైరా”, “భాగమతి”, “నిశ్శబ్దం”, “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” చిత్రాల్లో మాత్రమే నటించింది. అంటే ఏడేళ్లల్లో నాలుగు చిత్రాలు.
తాజాగా మరో సినిమా ఈ భామ ఒప్పుకొంది. దర్శకుడు క్రిష్ తీసే లేడి ఓరియెంటెడ్ చిత్రం అనుష్క సైన్ చేసింది. ఇందులో ఆమె సరసన ఒక యువ హీరో నటిస్తాడు. కానీ అసలైన హీరో మాత్రమే ఆమె.
ఈ సినిమాని కూడా యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. “భాగమతి”, “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” చిత్రాలను కూడా ఆ సంస్థే నిర్మించింది. “యువి” బ్యానర్లో నటిస్తేనే ఆమె సేఫ్ గా ఫీల్ అవుతుందట ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందుకే వేరే నిర్మాణ సంస్థలకు ఆమె సినిమాలు సైన్ చెయ్యడం లేదు.
ఇలా అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ ని కంటిన్యూ చేద్దామనే ఆలోచనలో ఉంది ఈ నలభై రెండేళ్ల సుందరి.