
అనుష్క శెట్టి దాదాపు నాలుగేళ్లుగా సినిమాల సంఖ్య తగ్గించింది. ఏడాదికి ఒక్క సినిమా కూడా చెయ్యలేదు ఈ మధ్య. కానీ ఉన్నట్టుండి ఆమె ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తోంది.
అంతకుముందు ఆమె బరువు సమస్యతో బాధపడింది. ఇప్పుడు ఆ బాధ లేదు. ఆమె మరీ స్లిమ్ అవలేదు కానీ మునుపటితో పోల్చితే చాలా బరువు తగ్గింది. అందుకే ఇప్పుడు కాన్ఫిడెంట్ గా సినిమాలు చేస్తోంది.
అనుష్క శెట్టి ప్రస్తుతం తెలుగులో “గాటి” అనే సినిమాలో నటిస్తోంది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కథ అంతా గంజాయి వ్యాపారం చుట్టూ సాగుతుంది. ఆమె గంజాయి అమ్మే డాన్ గా నటించనుంది.
ఇక ఇటీవలే ఆమె మలయాళంలో మరో సినిమా మొదలుపెట్టింది. ఇలా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ చేస్తోంది. తెలుగులో మరో సినిమా యువి క్రియేషన్స్ కోసం చేస్తుందట.