అనుష్క పాత అకౌంట్ కొత్తగా

అనుష్క సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్ గా ఉండదు. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ఫోటోలు, సెలబ్రిటీలకు బర్త్ డే విషెస్ పెడుతుంటుంది. అంతకన్నా పెద్దగా హంగామా చెయ్యదు. ఐతే, ఇప్పుడు ట్విట్టర్లోకి వచ్చాను అంటూ ఒక పోస్ట్ పెట్టింది. నిజానికి ఇది ఆమె కొత్త అకౌంట్ కాదు. 2010లోనే ఆమె అభిమానులో, ఆమె టీం మెంబర్లో “మిస్అనుష్కశెట్టి” పేరుతో ఒక అకౌంట్ ట్విట్టర్ లో క్రేయేట్ చేశారు. కానీ అనుష్క దాని తన అకౌంట్ గా ఇన్నాళ్లు వాడలేదు.

ఇప్పుడు అది తన అఫీసియల్ అకౌంట్ అంటూ ఇప్పుడు నిశ్శబ్డం సినిమా ప్రమోషన్ సందర్భంగా ప్రకటించింది. అంటే 2010 అక్టోబర్ లో అకౌంట్ క్రియేట్ చేస్తే… 2020 అక్టోబర్ లో దాన్ని తన అధికారిక ఖాతాగా వాడుతోంది అనుష్క.

నెక్స్ట్ ఇయర్ మరో రెండు సినిమాల్లో నటించనుంది అనుష్క. రాబోయే కాలంలో ఎక్కువగా ఆన్ లైన్లోనే ప్రచారం ఎక్కువ చేసుకోవాలి. కరోనా నేర్పిన పాఠము ఇది. అందుకే, అనుష్క ఇప్పుడు అర్జెంట్ గా పాత ట్విట్టర్ అకౌంట్ ని వాడుతోంది. లక్కీగా ఆమెకి దాదాపు 9 లక్షల ఫాలోవర్స్ ఈ పదేళ్లలో వచ్చారు ఈ అకౌంట్ కి.

Related Stories