ఇన్నాళ్లకు కనిపించిన స్వీటీ!

Anushka Shetty

అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత హైదరాబాద్ లో దర్శనమిచ్చింది. ఆమె బెంగళూరు నుంచి ఈ రోజు హైదరాబాద్ కి వచ్చింది. ఎయిర్పోర్ట్ వద్ద ఆమె ఈ లుక్ లో దర్శనమిచ్చింది.

40కి చేరువలో ఉన్న అనుష్క కొత్తగా సినిమాలు ఒప్పుకోవట్లేదు. ఏడాదికి ఒకటి లేదా రెండేళ్లకు ఒకటి అలా చేసుకుంటూ వెళ్తోంది. సినిమాల్లో నటించాలనే కోరిక తగ్గిందిట. బాగా నచ్చిన ప్రాజెక్టులు మాత్రమే ఒప్పుకుంటోంది. లాస్ట్ ఇయర్ ఆమీ నటించిన నిశ్శబ్దం అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదలయింది. ఆ సినిమాకు ఆమెకి విమర్శలే దక్కాయి. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ భామకి నిరాశే దక్కింది.

ఐతే 2021లో మాత్రం ఒక సినిమా చేయనుంది. ఇప్పటికే అది చర్చల దశలో ఉంది. తనకి బాగా కావాల్సిన సంస్థ ఈ మూవీని నిర్మించనుంది. అనుష్క శెట్టి పెళ్లి గురించి మొన్నటివరకు చాలా పుకార్లు షికార్లు చేశాయి. ఐతే, ఆమె ఆ ఊసే ఎత్తడం లేదు.

More

Related Stories