త్వరలోనే అనుష్క దర్శనం


అనుష్క శెట్టి …జనరల్ పబ్లిక్ లోకి వచ్చి చాలా కాలమే అయింది. ఏ ఈవెంట్ కి ఆమె రావడం లేదు. షూటింగ్ లొకేషన్, ఇల్లు… ఇదే ఆమె రొటీన్ వ్యవహారం. మునుపటిలా ఫంక్షన్స్ కి వచ్చి వెళ్లే పద్దతి మానేసింది.

ఐతే, ఇప్పడు ఆమె మనందరికీ దర్శనం ఇవ్వనుంది. దాదాపు మూడేళ్ళ తర్వాత ఆమె ఓక ఇంటర్వ్యూ చేయనుంది. బాలకృష్ణ నిర్వహించే టాక్ షోలో పాల్గొనేందుకు ఆమె అంగీకరించినట్లు టాక్. బాలయ్య కాబట్టి ఆమె ఒప్పుకుందట.

ఆమె బాగా లావు కావడం ఒక కారణం. ఆరోగ్య సమస్యలు మరో కారణం. అందుకే ఆమె పబ్లిక్ అప్పియరెన్స్ లు మానేసింది. ప్రస్తుతం ఆమె నవీన్ పోలిశెట్టితో కలిసి ఒక మూవీలో నటిస్తోంది. అది తప్ప మరో సినిమా చెయ్యడం లేదు.

అనుష్క, బాలకృష్ణ గతంలో ‘ఒక్క మగాడు’ చిత్రంలో కలిసి నటించారు.

 

More

Related Stories