ఫారిన్ మూవీలో నటిస్తా: అనుష్క

Anushka Shetty

డైరక్టర్ ను చూస్తారా.. కథ చూస్తారా?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కొంచెం కష్టం. డైరక్టర్ ను మాత్రమే చూస్తామంటే ఓ చిక్కు. దర్శకుడితో సంబంధం లేదు కథకే ప్రాధాన్యం అంటే మరో చిక్కు. అందుకే ఇలాంటి ప్రశ్నల్ని హీరోహీరోయిన్లు దాటేస్తుంటారు. అయితే అనుష్క మాత్రం అలా స్కిప్ చేయాలనుకోలేదు. తన తెలివితేటలు రంగరించి మరీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పింది.

“నేను దర్శకుల నటిని. దర్శకుడి విజన్ ను పూర్తిగా ఫాలో అవుతాను. అయితే ఏదైనా కంటెంట్ తర్వాతే. నా కంటే కథే గొప్పది. కథ బాగున్నప్పుడే అన్నీ కలిసొస్తాయి.” ఇలా చాలా చాకచక్యంగా సమాధానమిచ్చింది అనుష్క.

అంతేకాదు.. ఈ సందర్భంగా తన మనసులో ఉన్న మరో కోరికను కూడా బయటపెట్టింది. అవకాశం వస్తే తనకు కొన్ని ఫారిన్ లాంగ్వేజెస్ లో నటించాలని ఉందని చెప్పుకొచ్చారు. చాలామంది హాలీవుడ్ సినిమానే అనుకుంటారని.. కానీ తనకు హాలీవుడ్ తో పాటు ఇరానియర్, కొరియన్, ఫ్రెంచ్ భాషల్లో నటించాలని ఉందంటూ తన మనసులో కోరిక బయటపెట్టింది బొమ్మాలి.

Related Stories