
అనుష్క కొత్త సినిమా ఇంకా అనౌన్స్ చెయ్యలేదు. కానీ ఉన్నట్లుండి ఆమెకి జనాలకు ఒక పాజిటివ్ సందేశం ఇవ్వాలనిపించినట్లుంది. ఆమె సుదీర్ఘమైన ఒక లెటర్ రాసింది. ఈ కోవిడ్ సంక్షోభంతో అందరి జీవితాలు ఇబ్బందికి గురి కావడమో, ఒత్తిడికి లోనుకావడమో జరిగింది. అందుకే, ఆమె తన వంతుగా అందరిలో స్ఫూర్తినింపే ప్రయత్నం చేస్తోంది.
“మీరు ప్రేమించే వారితో, మీ వారితో టచ్ లో ఉండండి. ప్రేమ చూపండి,” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక భారీ సందేశాన్ని మొదలు పెట్టింది.
ఇంగ్లిష్ లో రాసిన ఆ సుదీర్ఘమైన ఆమె సందేశాన్ని క్లుప్తంగా చెప్పాలంటే…
“ప్రతి సమస్యని అధిగమిస్తూ ముందుకు కదలండి. కష్టాలు చెప్పే పాఠాలు నేర్చుకొండి. మీ స్నేహితుతో సరదాగా గడపాలి. వారిని ఆలింగనం చేసుకొండి. మనసారా నవ్వండి, ఆశతో జీవించండి. కానీ, కోలుకునే క్రమంలో ఉద్రేకానికి లోను కావొద్దు.
అందరితో బంధాలను పెంచుకొండి. మీతో పెనవేసుకున్న ప్రేమలను, మంచి క్షణాలను ఆస్వాదించండి. ఈ సంక్షోభ సమయంలోనూ బతికే అవకాశం మీకు దక్కిందన్న వాస్తవాన్ని గురించండి. అందమైనవి అన్ని దూరం అవుతున్నాయి. ఆ కోల్పోతున్న వాటిలో మీ హృదయం ఒకటి కావొద్దు… హాయిగా జీవించండి… ప్రేమించండి!”