శృంగార తారతో రవితేజ!

Anveshi Jain

రవితేజ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం ముగింపు దశకు చేరుకొంది. ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కోసం ముంబై నుంచి ఒక అందాల భామని తీసుకొచ్చారు. అన్వేషి జైన్ అనే భామ ఈ ఐటెం సాంగ్ చేసింది.

అన్వేషికి శృంగార తార అనే ఇమేజ్ ఉంది. బాలీవుడ్ లో ఒటిటి కోసం చేసిన ‘గంధీ బాత్’ (బూతు మాటలు) అనే సిరీస్ లో చాలా చాలా హాట్ గా నటించి పాపులరైందట. దాంతో ఈ భామతో ఈ సినిమాలో హాట్ హాట్ పాటొకటి చేయించారు. ఆమెతో రవితేజ స్టెప్పులు వేశాడు. ఇటీవలే ఈ పాటని హైదరాబాద్ లో చిత్రీకరించారు.

తెలుగులో మళ్ళీ ఐటెం సాంగులకు క్రేజ్ పెరుగుతోంది. సమంత, తమన్న వంటి పేరొందిన హీరోయిన్లు ఐటెం సాంగ్స్ లో నటిస్తున్నారు. మరికొందరు నిర్మాతలు బాంబే నుంచి ఇలాంటి భామలను దిగుమతి చేసుకుంటున్నారు.

ఐటెంసాంగ్ చేసినందుకు హీరోయిన్లకి భారీ మొత్తమే ముడుతోంది. అందుకే, బాలీవుడ్ భామలు కూడా రెడీ గా ఉన్నారు.

 

More

Related Stories