టాలీవుడ్ కి కొత్త ‘ఐటెం’!


ఒకప్పుడు ప్రతి పెద్ద సినిమాలో ఒక కొత్త ఐటెం గర్ల్ కనిపించేది. ఇప్పుడు ఐటెం సాంగ్స్ జోరు తగ్గింది. ఒకవేళ ఐటెం సాంగ్స్ పెట్టాల్సి వస్తే… పేరొందిన టాప్ హీరోయిన్లని తీసుకుంటున్నారు. ‘పుష్ప’లో సమంత, ‘ఎఫ్ 3’లో పూజ హెగ్డే అలాగే మురిపించారు.

ఐతే, కొందరు దర్శక, నిర్మాతలు మాత్రం పెద్ద హీరోయిన్ల కన్నా బాలీవుడ్ లో హాట్ భామలుగా పేరొందిన వారినే దిగుమతి చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. అలా మన తెలుగులోకి అడుగుపెడుతున్న ముంబై ముద్దుగుమ్మ… అన్వేషి జైన్.

హిందీలో ‘గందీ బాత్’ పేరుతో ఒక వెబ్ సిరీస్ లో నటించింది అన్వేషి జైన్. అది ‘పెద్దలకు మాత్రమే’ టైప్ వెబ్ సిరీస్. ఆ వెబ్ డ్రామాలో ఆమె హీటెక్కించే అందచందాల షో చూసిన తర్వాతే తెలుగులోకి పరిచయం చేస్తున్నారు మేకర్స్. రవితేజ హీరోగా రూపొందుతోన్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో ఈ భామ ఐటెం సాంగ్ చేసింది.

ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దాంతో, అన్వేషి జైన్ చేసిన ఐటెం సాంగ్ వీడీయో ప్రోమోని తాజాగా విడుదల చేశారు.

Naa Peru Seesa Song Promo | Ramarao On Duty | Ravi Teja | Anveshi Jain |Shreya Ghoshal|Sam CS|Sarath

ఈ పాట క్లిక్ అయితే అన్వేషి తెలుగు తెరకు మరో ముమైత్ ఖాన్ లా మారుతుందేమో. శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన ఇద్దరు భామలు నటిస్తున్నారు.

 

More

Related Stories