- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చింది. కరోనా రెండో వేవ్ కారణంగా మూడు నెలలుగా థియేటర్లను మూసివేశారు. ఇప్పుడు ఆంక్షలను సడలించింది వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకొంది ఏపీ ప్రభుత్వం.
ఐతే, సీటుకు, సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా చూడాలనే నిబంధన విధించింది ప్రభుత్వం. అంటే… పూర్తిస్థాయి అనుమతి కాదు.
తెలంగాణాలో ఇప్పటికే థియేటర్లు తీర్చేందుకు అనుమతి ఉంది. ఎటువంటి ఆంక్షలు లేవు. కానీ ఇంకా థియేటర్లు ఓపెన్ అవ్వలేదు. ఏపీ, తెలంగాణాలో పూర్తిగా థియేటర్లు తెరవాలంటే… కొత్త సినిమాల విడుదల విషయంలో క్లారిటీ రావాలి.