
రాంగోపాల్ వర్మ నిన్న ఒక కొత్త భామని పరిచయం చేస్తున్నా అంటూ చాలా హడావిడి చేశారు. ఒరిస్సాకి చెందిన అప్సర అనే భామ అందాలకి, ఆమె డాన్స్ కి ఫిదా అయిపోయి.. “థ్రిల్లర్” అనే సినిమాలో పరిచయం చేస్తున్నాను అంటూ హంగామా చేస్తే.. ఆ భామకి ట్విట్టర్లో ఫాలోయింగ్ మామూలుగా పెరగలేదు. ఆమె ఫోటోషూట్ లు ఆలా ఉన్నాయి మరి. ప్యాంటు వేసుకోకుండా కేవలం పాంటీతోనే ఆమె ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో కాకా పుట్టించాయి.
వర్మని పబ్లిసిటీ విషయంలో ఎవరూ ఢీకొట్టలేరు అని ఈ ట్రెండ్ తో మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే… వర్మ చేసింది ఒక గిమ్మిక్.
అప్సర అనే భామ అసలు పేరు అనికేత మహారాణ. ఈ అమ్మడు ఇంతకుముందే తెలుగులో “4 లెటర్స్” అనే సినిమాలో నటించింది. గతేడాది విడుదలైన ఆ మూవీ అట్టర్ ఫ్లాప్. సో.. ఆనికేత పేరు మర్చి మేకోవర్ చేసి అప్సరగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు వర్మ.
తీసే షార్ట్ ఫిలిమ్స్ కి కూడా ఫ్రీగా పబ్లిసిటీ కొట్టేయడంలో వర్మకే తెలిసిన విద్య.