తెలుగులో రెహ్మాన్ మరో మూవీ?

AR Rahman

ఏ.ఆర్. రెహ్మాన్ ఆస్కార్ అవార్డు విజేత. సంగీత ప్రపంచంలో ఐకాన్. ఐతే రెహ్మాన్ స్ట్రైట్ తెలుగు సినిమాలతో పెద్దగా విజయాలు చూడలేదు. ఆయన తమిళ్, హిందీ సినిమాలకు స్వరపరిచిన పాటలు తెలుగులో డబ్ అయి సంచలనాలు సృష్టించాయి. తెలుగులో నేరుగా స్వరపరిచిన “నాని”, “గ్యాంగ్ మాస్టర్”, “సూపర్ పోలీస్”, “కొమరం పులి” వంటి సినిమాలు ఆడలేదు. ఆ సినిమాల పాటలు బాగానే పాపులర్ అయ్యాయి. కానీ సినిమాలు హిట్ కాలేదు.

అందుకే మన దర్శక, నిర్మాతలు రెహమాన్ కన్నా కీరవాణి, తమన్, దేవిశ్రీప్రసాద్ లతోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ రెహమాన్ తెలుగులో బిజీ కానున్నారు.

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా (#RC16) రానుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రెహమాన్ రెండు పాటలు పూర్తి చేశారు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఇది రెహమాన్ కి తెలుగులో రీఎంట్రీ.

తాజాగా మరో పెద్ద చిత్ర నిర్మాతలు కూడా రెహ్మాన్ తో చర్చలు జరుపుతున్నారు. పాన్ ఇండియా లెవల్లో తీయబోతున్న ఒక బడా చిత్రం ఇది. బడ్జెట్ కూడా పెద్దదే.త్వరలోనే ఈ సినిమా ప్రకటన కూడా ఉంటుంది. ఇలా టాలీవుడ్ కు సంబంధించి ఒకేసారి రెండు పెద్ద సినిమాలకు రెహ్మాన్ పని చెయ్యనుండడం విశేషమే.

More

Related Stories