రెహమాన్ కి మాతృ వియోగం

AR Rehman

ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్.రెహమాన్ తల్లి కరీమా బేగం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కరీమా బేగం సోమవారం చెన్నైలో తుది శ్వాస విడిచారు. రెహమాన్ విజయాల వెనుక ఆమె తల్లి ఉన్నారు.

రెహమాన్ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయారు. మొత్తం కుటుంబ బాధ్యత అంతా ఆమె తల్లిపై పడింది. రెహమాన్ కూడా టీనేజ్ నుంచే పని చెయ్యడం మొదలుపెట్టారు. ఐతే, కొడుకు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎదగాలని ఆమె రెహమాన్ కి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. తన సక్సెస్ కి కారణం తన తల్లి అని రెహమాన్ అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు.

More

Related Stories