- Advertisement -

చాలాకాలంగా విడుదలకు నోచుకోని ‘ఆరడుగుల బుల్లెట్’ ఇప్పుడు వెలుగు చూసేందుకు ప్రయత్నం చేస్తోంది.
గోపీచంద్ – నయనతార జంటగా సీనియర్ దర్శకుడు బి. గోపాల్ తీసిన యాక్షన్ ఎంటర్టెనర్… ‘ఆరడుగుల బుల్లెట్’. తాండ్ర రమేష్ నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అంటున్నారు. ఇటీవల ‘సీటిమార్’ సినిమా విడుదల కావడం, దీనికి మంచి ఓపెనింగ్ రావడంతో ఈ సినిమా మేకర్స్ ఇప్పుడు ‘ఆరడుగుల బుల్లెట్’కి మోక్షం కలిగించే పనిలో పడ్డట్లు కనిపిస్తోంది
వక్కంతం వంశీ కథ, మణిశర్మ మ్యూజిక్ తో రూపొందిన ఈ మూవీ మూడేళ్ళుగా విడుదల కోసం ప్రయత్నాలు చేస్తోంది.