అర్చన ఇప్పుడిలా ఉంది

Archana

పెళ్లయితే హీరోయిన్లు బాగా మారిపోతారు. ఇక సినిమాలతో సంబంధం లేదనుకున్నప్పుడు ఆ ఫిజిక్ లో మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఇప్పుడు హీరోయిన్ అర్చన అలియాస్ వేద కూడా ఇలానే తయారైంది. గతేడాది నవంబర్ లో పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. ఏడాది తిరగకుండానే ఇలా షేప్ అవుట్ అయింది.

పెళ్లయినప్పటికీ హీరోయిన్లు ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న రోజులివి. అవకాశాలతో సంబంధం లేకుండా అటు గ్లామర్ ను ఇటు వయ్యారాల్ని బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ స్టయిల్ డిజైన్ చేసుకుంటున్నారు. కానీ అర్చన మాత్రం ట్రెండ్ కు దూరంగా జరిగింది. పెళ్లయిన కొన్ని నెలలకే బొద్దుగా తయారైంది.

అయితే తన ఫిజిక్ తో సంబంధం లేకుండా మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ మాజీ హీరోయిన్. ప్రస్తుతం తను హ్యాపీగా ఉన్నానని, మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడొస్తానో చెప్పలేనంటోంది.

Related Stories