25 ఏళ్ల తర్వాత అర్చన రీఎంట్రీ

Archana

నిరీక్షణ, దాసి వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పేరు తెచ్చుకున్న నటి… అర్చన. రెండు సార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డులు పొందిన తెలుగు నటి ఆమె. అలాగే, భారత్ బంద్, లేడీస్ టైలర్ వంటి హిట్ చిత్రాల్లో కూడా నటించారు.

25 ఏళ్ల తర్వాత ఆమె మళ్ళీ తెలుగులో నటిస్తున్నారు. ‘చోర్ బజార్’ చిత్రంలో ఆమె ఒక కీలక పాత్ర పోషించనున్నారు. ఈ పాత్రకి ఆమె అయితేనే బాగుంటుంది అని అర్చనని ఒప్పించారట మేకర్స్.

‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ జీవన్ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు. వి.ఎస్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్ లలో విడుదల కానుంది.

ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న’చోర్ బజార్’లో గెహన సిప్పీ హీరోయిన్. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 

More

Related Stories