కారు కొనుకున్న అరియనా

బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానాకి క్రేజ్ పెరిగింది. ‘బిగ్ బాస్ తెలుగు 4’లో ఒక కంటెస్టెంట్ గా కనిపించిన ఈ భామ ఇప్పుడు బోల్డ్ ఇంటర్వ్యూలతో, రామ్ గోపాల్ వర్మ కంపెనీలో టీం మెంబర్ గా మరింత పాపులర్ అయింది. అందుకే, యాంకర్ గా, నటిగా ఆమెకు అవకాశాలు బాగా వస్తున్నాయి. సంపాదన కూడా పెరిగినట్లుంది.

లేటెస్ట్ గా కొత్త కియా కారుని సొంతం చేసుకొంది. కొత్త కారు కొన్నాను ఎలా వుంది ఫ్రెండ్స్ అంటూ ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

అరియానా మొదట రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలతో పేరు తెచ్చుకొంది. అలా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రామ్ గోపాల్ వర్మతో హాట్ అండ్ బోల్డ్ ఇంటర్వ్యూ ఒకటి చేసి మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించుకొంది.

 

More

Related Stories