అరియాన కూడా ప్రేమలో పడిందట!

- Advertisement -
Ariyana Glory


‘బిగ్ బాస్ తెలుగు 4’తో పాపులారిటీ పొందిన అరియాన గ్లోరీ తాజాగా ట్రెండింగ్ టాపిక్ అయింది. రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి ఆమె వార్తల్లో నిలిచింది ఐతే, ఇప్పుడు ఆమె పర్సనల్ లైఫ్ కి సంబంధించి కూడా ఒక ఇంట్రస్టింగ్ వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది.

ఈ భామ కూడా ప్రేమలో ఉందట. ‘బిగ్ బాస్’లోకి అడుగు పెట్టకముందే ఆమె ఒక ఎన్నారైతో డేటింగ్ లో ఉందని మీడియా వార్తలు చెప్తున్నాయి. వృత్తిరీత్యా అతను ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. కానీ హైదరాబాద్ లో పని చేస్తున్నప్పుడే అరియానాతో డేటింగ్ స్టార్ట్ చేశాడట.

వర్మ ఇంటర్వ్యూ, ఆ ప్రశ్నలు తన బాయ్ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని తెగ టెన్షన్ పడిందట.

ఏది ఏమైనా, ఈ అమ్మడు మీడియాలో, సోషల్ మీడియాలో ఎలా అటెన్షన్ పొందాలో బాగా నేర్చుకొంది. అంతా గురువు వర్మ శిష్యరికం వల్ల వచ్చింది కాబోలు.

 

More

Related Stories