బొద్దుగుమ్మగా మారిన అరియాన

- Advertisement -
Ariyana Glory

యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అరియా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో లైమ్ లైట్ లోకి వచ్చింది. వర్మ ఆమె అందాన్ని పొగడడం, ఆ వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ఆ వెంటనే ‘బిగ్ బాస్’ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ వల్ల ఆమె మరింత పాపులర్ అయింది.

బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక ఏవో సినిమా అవకాశాలనీ, పాటలు అని కొన్నాళ్ళూ హడావిడి చేసింది. బాగానే సంపాదించుకొంది. ఏడాది తిరగ్గానే మొత్తం మారిపోయింది.

సరిగ్గా ఏడాది క్రితం ఆమె ఫోటోలు చూస్తే చాలు ఆమె ఇప్పుడు ఎంత బొద్దుగా మారిపోయిందో అర్థం అవుతుంది. ఇదివరకు సన్నని తీగలా ఉండేది. అరియనా జూనియర్ ఇలియానా అని కుర్రకారు పొగిడేవారు. ఇప్పుడు ఆమె ఇలా బొద్దుగా మారడంతో కామెంట్స్ వేరేలా ఉన్నాయి.

ఏడాదిలోనే ఇంత మార్పు రావడం ఏంటి అని అంటున్నారు. ఐతే, బొద్దుగా ఉంటేనే బాగున్నావు అని అందరూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అంటోంది ఈ భామ.

Ariyana Glory

ఇప్పుడే “నిండుగా”, “కంటికింపుగా” ఉన్నాను అని ఫ్రెండ్స్ కూడా అంటున్నారు అని చెప్తోంది. ఆ మాట ఏమో కానీ ఇక్కడితో కంట్రోల్ చెయ్యకపోతే ఆ తర్వాత కష్టమే అని అంటున్నారు.

 

More

Related Stories