అరియాన ఇక ఓటిటి షోలో

- Advertisement -

బిగ్ బాస్ ఓటిటిలోకి రానుంది. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకొంది బిగ్ బాస్ తెలుగు. ఎంతో క్రేజ్ వచ్చింది ఈ షోకి.

ఇక ఇప్పుడు ఓటిటి జనాన్ని ఆకట్టుకునేందుకు కొత్త అవతారంలో రానుంది ఈ షో. డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో మాత్రమే స్ట్రీమ్ అయ్యే ఈ కొత్త షోలో ఎక్కువ శాతం పాపులర్ కంటెస్టెంట్లు ఉండబోతున్నారు అనేది టాక్. ఇంతకుముందు ఐదు సీజన్లలో పాల్గొన్న కొంతమంది కంటెస్టెంట్ లను ఈ ఓటిటిషోకి కూడా తీసుకురానున్నారు.

ఇప్పటికే వారి లిస్ట్ ఫైనలైజ్ అయింది. అందరినీ క్వారెంటైన్ లో పెట్టనున్నారు. ఈ క్వారంటైన్ లిస్ట్ లో ఉన్న వారి పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు తిరుగుతున్నాయి. అందులో ఒక పేరు… అరియాన గ్లోరీ. ఈ స్లిమ్ సుందరికి క్రేజ్ బాగుంది సోషల్ మీడియాలో. అందుకే ఈ పిల్లని మళ్ళీ ఓటిటిలోకి తీసుకొస్తున్నారు.

ఇప్పటికే బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పిన ఈ బ్యూటీ ఓటిటి బిగ్ బాస్ కి సిద్ధంగా ఉంది. ఇది మరోసారి హెల్ప్ అవుతుంది అరియాన గ్లోరీకి. బిగ్ బాస్ తెలుగు 4లో ఫైనల్ వరకు వచ్చింది అరియాన. ఆ తర్వాత ఒకటిరెండు సినిమాల్లో చిన్న రోల్స్ దక్కించుకొంది. కానీ, అవేవి పేరు తీసుకురాలేదు. సో, మళ్ళీ ఈ ఓటిటిషోతో అయినా క్రేజ్ వస్తుందేమో చూడాలి.

 

More

Related Stories