బాలీవుడ్ హీరోకు కరోనా

బాలీవుడ్ లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. తాజాగా హీరో అర్జున్ కపూర్ కు కరోనా సోకింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అతడికి పాజిటివ్ వచ్చింది. తనకు ఎలాంటి లక్షణాల్లేవని ప్రకటించిన అర్జున్ కపూర్.. తను ఎందుకు టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చిందో మాత్రం చెప్పలేదు.

ప్రస్తుతానికైతే డాక్టర్ల సలహా మేరకు అర్జున్ కపూర్, హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు. రీసెంట్ గా తనతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నాడు. అంతేకాదు.. ఇకపై తన హెల్త్ అప్ డేట్ ను తానే ఇస్తానని, ఎలాంటి పుకార్లు నమ్మొద్దని ఇండైరెక్ట్ గా చెబుతున్నాడు.

బోనీ కపూర్ వారసుడిగా ఇండస్ట్రీలోకొచ్చిన అర్జున్ కపూర్.. 2-3 సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలతో వచ్చిన పబ్లిసిటీ కంటే.. మలైకా అరోరాతో డేటింగ్ చేస్తూ అర్జున్ కపూర్ పొందిన ప్రచారం చాలా ఎక్కువ. అన్నట్టు మలైకా కూడా టెస్ట్ చేయించుకుంటే మంచిదేమో. 

Related Stories