తుస్సుమన్న అర్జున్ సురవరం

బుల్లితెరపై ఈ వారం మహేష్, రామ్ చరణ్, నాగశౌర్య సినిమాలు మెరిశాయి. సినిమా రేటింగ్స్ లో మొదటి 3 స్థానాలు వీటివే. నిఖిల్ నటించిన “అర్జున్ సురవరం” సినిమా డిసప్పాయింట్ చేయగా.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ గా ప్రసారమైన సూర్య, కార్తి సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

మహేష్ నటించిన “మహర్షి” సినిమా ఈ వారం రేటింగ్స్ లో టాప్ లో నిలిచింది. 21వతేదీన జెమినీలో మరోసారి ప్రసారమైన ఈ సినిమాకు అత్యథికంగా 7.70 (ఏపీ, తెలంగాణ టోటల్) రేటింగ్ వచ్చింది. ఈ మూవీ తర్వాత రెండో స్థానంలో రామ్ చరణ్ నటించిన “వినయ విధేయరామ” (6.41), మూడో స్థానంలో నాగశౌర్య నటించిన “అశ్వద్థామ” సినిమా (4.62) నిలిచింది.

ఎప్పట్లానే ఈసారి కూడా టాప్-10 లిస్ట్ లో “బాహుబలి”కి చోటు దక్కగా, అందర్నీ ఆశ్చర్యపరుస్తూ “90ml” మూవీ (3.97) మరోసారి ఆకట్టుకుంది.

ఫస్ట్ టైమ్ టీవీలో ప్రసారమైన “అర్జున్ సురవరం” సినిమా ఆకట్టుకోలేదు. ఈ సినిమాకు హీరో నిఖిల్ స్పెషల్ గా ప్రమోషన్ కూడా చేశాడు. అయినప్పటికీ ఇది 3.80 టీఆర్పీతోనే ఆగిపోయింది.

ఇక కార్తి నటించిన “ఖైదీ”, సూర్య నటించిన “ఎన్జీకే” సినిమాలు కూడా ఫస్ట్ టైమ్ స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యాయి. ఎన్జీకేకు 3.56, ఖైదీకి 3.45 టీఆర్పీ వచ్చింది. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ “రైల్” అనే సినిమా బ్రహ్మాండంగా మెరిసింది. ధనుష్-కీర్తిసురేష్ నటించిన ఈ పాత సినిమాను ఫ్రెష్ గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారంచేస్తే.. ఏకంగా 4.05 టీఆర్పీ రావడం విశేషం.

Related Stories