విలన్ గా అరవింద్ స్వామే!

- Advertisement -
Arvind Swamy

మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో విలన్ ఎవరు అనేది ఇంకా టీం అనౌన్స్ చెయ్యలేదు. కీర్తి సురేష్ పేరు తప్ప మరో క్యాస్ట్ మెంబర్ గురించి ప్రకటన రాలేదు. సినిమా ప్రారంభంలో అరవింద్ స్వామిని అనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత జాన్ అబ్రహం, విజయ్ సేతుపతి, ఉపేంద్ర, వివేక్ ఒబెరాయ్… ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ ఏదీ వర్కౌట్ కాలేదని అంటున్నారు.

ఐతే, ఇప్పుడు అరవింద్ స్వామినే ఫిక్స్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారని టాక్.

పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే 40 రోజుల షూటింగ్ పూర్తి చేసుకొంది. ఈ సినిమా షూటింగ్ మళ్లీ జులైలో మొదలు కావొచ్చు. కరోనా రెండో వేవ్ పూర్తిగా తగ్గుముఖం పడితే మళ్ళీ షూటింగులు షురూ అవుతాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

 

More

Related Stories