నోటా దర్శకుడు… మల్టీస్టారర్ మూవీ

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “నోటా” సినిమాతో తెలుగులో కూడా అంతోఇంతో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ఆనంద్ శంకర్. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు ఈ దర్శకుడు. ఈ గ్యాప్ లో తన గర్ల్ ఫ్రెండ్ తో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు.

అలా రెండేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు తన కొత్త ప్రాజెక్టు ప్రకటించాడు. విశాల్, ఆర్య హీరోలుగా మల్టీస్టారర్ మూవీ ఎనౌన్స్ చేశాడు. ఇంతకుముందు విశాల్-ఆర్య కలిసి “వాడు-వీడు” అనే సినిమాలో నటించారు. ఆర్య నటించిన ఓ రొమాంటిక్ మూవీలో కూడా విశాల్ చిన్న గెస్ట్ రోల్ చేశాడు.

మళ్లీ ఇన్నాళ్లకు ఈ హీరోలిద్దరూ కలిసి మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు. ఇదొక యాక్షన్ ఎంటర్ టైనర్ అని టాక్.

ఇక ఆనంద్ శంకర్ విషయానికొస్తే.. మురుగదాస్ వద్ద ‘తుపాకి’, ‘సెవెన్త్ సెన్స్’ లాంటి సినిమాలకు వర్క్ చేశాడు. తర్వాత తనే దర్శకుడిగా మారి విక్రమ్ ప్రభు హీరోగా ఓ సినిమా తీశాడు. ఆ తర్వాత  విక్రమ్ తో ‘ఇంకొక్కడు’ అనే సినిమా తీశాడు. తర్వాత మూడో చిత్రంగా ‘నోటా’ తెరకెక్కించాడు. తాజా మల్టీస్టారర్ మూవీ ఇతడికి దర్శకుడిగా నాలుగో సినిమా.

Related Stories