రాజమౌళి సినిమాల్లో చెయ్యాలి: ఆషిక

- Advertisement -
Ashika Ranganath

ఇంతకుముందు కళ్యాణ్ రామ్ సరసన “అమిగోస్” చిత్రంలో నటించింది ఆషిక రంగనాథ్. ఆమెకి తెలుగులో రెండో చిత్రం… నా సామి రంగ. ఈ సినిమాలో సీనియర్ హీరో నాగార్జున సరసన నటించింది. ఇద్దరి మధ్య 35 ఏళ్ల గ్యాప్ ఉంది. కానీ ఈ సినిమాలో ఆమె “యంగ్” నాగార్జునకి జోడిగా నటించింది.

“ఇందులో నా పాత్ర పేరు … వరాలు. నాగార్జున వంటి పెద్ద హీరోతో నటించే అవకాశం రావడం అదృష్టం. నేను రెండు వేర్వేరు షేడ్స్ ఉన్న పాత్ర పోషించాను. ఇది తెలుగుదనం ఉట్టిపడే పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. నాగార్జున గారు చాలా స్వీట్ పర్సన్. ఆయనతో నటించడం మంచి మర్చిపోలేను,” అని చెప్పింది.

తన కన్నా వయసులో ఎంతో పెద్ద అయిన నాగార్జునతో ఆమె ఈ సినిమాలో రొమాన్స్ చేసింది. “నాగార్జున గారికి రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉంది. ఆయన ఎవర్ యంగ్. మా పాత్రల మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ వున్నాయి. అవి వినోదాత్మకంగా ఉంటాయి,” అని తమ మధ్య వయసు బేధం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.

అన్నట్లు ఆషికని చాలామంది జూనియర్ అనుష్క పిలుస్తారట. “అలా అన్నప్పుడు ఆనందం వేస్తుంది. ఆమెతో పోల్చడం అంటే కాంప్లిమెంట్ కదా. పైగా అనుష్క గారు అంటే నాకు ఇష్టం. ఆమె ఎన్నో గొప్ప సినిమాలు చేశారు,” అని చెప్పింది ఈ భామ.

Ashika Ranganath

గ్లామర్ షోకి రెడీ అని కూడా అంటోంది. “గ్లామర్ పాత్రలు చేస్తాను. నటనకు ప్రాధాన్యం ఉండే చిత్రాలు కూడా చేస్తాను. “నా సామి రంగ”లో నటనకే ప్రాధాన్యం ఉంది.”

రాజమౌళి సినిమాల్లో నటించాలి అనేది ఆమె డ్రీమంట.

More

Related Stories