తెలుగులో ఈ ఎంట్రీ ల‌క్కీ: ఆషిక


కన్నడ హీరోయిన్లకు ఇప్పుడు తెలుగులో ఎక్కువగా డిమాండ్ ఉంది. అనుష్క శెట్టి తర్వాత రష్మిక టాప్ రేంజ్ కి దూసుకెళ్లింది. అలా తెలుగు సినిమా రంగానికి పరిచయం అవుతోన్న మరో కన్నడ సుందరి… ఆషికా రంగ‌నాథ్. కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అమిగోస్’ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించారు.

ఆషికా రంగ‌నాథ్ చెప్పిన ముచ్చట్లు…

– చిన్న‌ప్పట్నుంచి తెలుగు సినిమాలు, పాట‌లు వినేదాన్ని. తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను.

– ‘అమిగోస్’ సినిమాలో ముందు వేరే హీరోయిన్ ని తీసుకున్నామని చెప్పారు. కానీ తర్వాత నాకే ఇచ్చారు ఆఫర్. నా పాత్ర‌ను మ‌లిచిన తీరు న‌చ్చ‌డంతో సినిమాకు ఓకే చెప్పేశాను.

– కళ్యాణ్ రామ్ చాలా కూల్ పర్సన్. ఆయన చాలా సాదాగా ఉంటారు. ఇందులో ఆయన మూడు పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన డెడికేషన్ కి ఫిదా అయ్యాను.

  • నేను ఇప్పటివరకు క‌న్న‌డ‌లో డజన్ సినిమాలు చేశాను. త‌మిళంలో ఓ సినిమా చేశాను.
  • తెలుగులో మరిన్ని అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అయితే ‘అమిగోస్’ సినిమా రిలీజ్ తర్వాతే ఒప్పుకుంటా.
 

More

Related Stories