
సమంత చేసిన మొదటి ఐటెం సాంగ్… “ఊ అంటావా ఊ అంటావా” పాటకి తనదైన శైలిలో డ్యాన్స్ చేసింది ‘బిగ్ బాస్ 3’ భామ ఆశు రెడ్డి. సమంతలాగే పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని… “ఊ అంటావా మావా” అంటూ ఊపేసింది. ఆ పాట వర్కింగ్ స్టిల్స్ ని ఆశు రెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది
సమంతకి ఇది నా ట్రిబ్యూట్ (ప్రశంసపూర్వకంగా చేసేది) అంటూ ఈ వీడియో చేసింది.
“పుష్ప” సినిమాలో సమంత పాట పెద్దగా రిజిస్టర్ కాలేదు. అలా వచ్చి ఇలా వెళ్ళింది అనిపించింది. కానీ, ఆ సాంగ్ మాస్ కి బాగా నచ్చింది. 100 మిలియన్ల కి పైగా వ్యూస్ అందుకొంది. ఐతే, ఈ పాట సమంతకి హెల్ప్ అయిందా లేదా అన్నది చూడాలి.
ఒక అగ్ర హీరోయిన్ గా ఉండి, ఫెమినిస్టుగా చెప్పుకొనే భామ ఇలాంటి పాట చెయ్యడం ఏంటి అనే కామెంట్స్ ఒకవైపు వినిపిస్తున్నాయి. మరోవైపు, డివోర్స్ తర్వాత ఆమె మళ్ళీ గ్లామర్ హొయలతో ఆమె సినిమా ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదిలం చేసుకొంది అనే వాదన కూడా వినిపిస్తోంది.