అసిన్ రీఎంట్రీ రూమరే!

గజిని, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, ఘర్షణ, లక్ష్మి నరసింహ… వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన అసిన్ మళ్ళీ నటించేందుకు రెడీ అవుతోంది అని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆమె రీఎంట్రీకి సర్వం సిద్ధం అయిందని, ఒక పెద్ద బ్యానర్ మూవీ నిర్మిస్తోందని ఆ కథనాలు చెప్పాయి. ఐతే, ఆమె మళ్ళీ సినిమా కోసం మేకప్ వేసుకుకునేందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదు అని తేలింది.

ఆసిన్ కూతురుకి మూడేళ్లు. అప్పుడే మళ్ళీ నటించాలని అనుకోవడం లేదంట. ఆమె భర్త రాహుల్ శర్మ… కోటీశ్వరుడు. వందల కోట్ల ఆస్తులున్న వ్యాపారవేత్త. డబ్బు కోసం ఆమె రీఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నటించాలన్న కోరికతో మాత్రం తిరిగి అడుగుపెట్టొచ్చు.

కానీ 35 ఏళ్ల ఆసిన్ ఇప్పుడు హీరోయిన్ పాత్రలు చెయ్యలేదు. అక్క, చెల్లి పాత్రలకు ఇంకా టైం ఉంది అనుకుంటుందేమో.

Related Stories