లాక్డౌన్లో స్పెషల్ ప్రాజెక్టు చేశా: సమంత

Samantha

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఓ స్పెషల్ ప్రాజెక్ట్ చేశానంటోంది సమంత. అదేంటనేది త్వరలోనే చెబుతానంటోంది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు వీడియోల రూపంలో సమాధానాలిచ్చిన ఈ బ్యూటీ.. చాలా అంశాలపై తన మనసులో మాట బయటపెట్టింది. హేవే లుక్..

ఎలాంటి రోల్ చేయడం కష్టం అనిపిస్తుంది?
గౌతమ్ మీనన్ ను కలవనంతవరకు రొమాంటిక్ జానర్ చేయడం కష్టం అనుకునేదాన్ని. నందినీరెడ్డిని కలవనంతవరకు కామెడీ చేయడం కష్టం అనుకునేదాన్ని. రాజ్ అండ్ డీకేను (ఫ్యామిలీ మేన్-2) కలవనంతవరకు యాక్షన్ చేయడం కష్టం అనుకునేదాన్ని. సో.. ఇప్పుడైతే ఏ పాత్ర చేయమన్నా భయం లేకుండా చేస్తా.

ఫేవరెట్ జానర్ ఏది?
ఈ ప్రశ్నకు కొంచెం ఆలోచించాలి. ఇష్టమైన జానర్ అంటూ ఏదీ లేదనిపిస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ వర్క్ చేసిన జానర్ లో మళ్లీ చేయాలనిపించదు. కాబట్టి ఏదో ఒక జానర్ ఇష్టమని చెప్పలేను. చేసింది మళ్ళీ మళ్లీ చెయ్యొద్దు అనుకుంటా.

బాగా కష్టపడ్డానికి మీకు ప్రేరణ ఏంటి?
కరోనాకు ముందు ఫెయిల్ అవుతానేమో అనే భయంతో ఎక్కువగా కష్టపడేదాన్ని. కానీ కరోనా వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండడం కోసం కష్టపడితే చాలనిపిస్తోంది. ఎందుకంటే భయపడి ఉపయోగం లేదు, ఆనందంగా ఉండాలి. అందుకోసం కష్టపడాలి.

లాక్ డౌన్ లో చేసిన బెస్ట్ పని?
ఓ స్పెషల్ ప్రాజెక్టు చేశాను. దాన్ని మీకు చూపించకుండా ఉండలేకపోతున్నాను. త్వరలోనే చూపిస్తా. దీంతో పాటు కుటుంబంతో ఎక్కువ సమయం గడిపాను.

మీరు చేస్తున్న అర్బన్ గార్డెనింగ్ గురించి చెప్పండి?
ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్బన్ గార్డెనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో మనం ఏం తింటున్నాం, ఎంత ఆరోగ్యంగా ఉంటున్నామనేది చాలా ముఖ్యం. కాబట్టి మనం తినే ఆహారాన్ని మనమే పండించుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచొచ్చు.

ఏదైనా ఎదురుదెబ్బ తగిలితే అది మీపై ఎంత ప్రభావం చూపిస్తుంది?
నాకు ఎదురైన ప్రతికూల ప్రభావాల్ని… నా చుట్టూ ఉండే వ్యక్తులు, నా పనిపై ప్రభావం చూపకుండా చూసుకుంటాను. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా నా పని నేను చేస్తాను. ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు చెదరనివ్వను.

ఫిట్ గా ఉండడానికి మీరు ఫాలో అయ్యే డైట్?
నా డైట్ చాలా సింపుల్. నేను శాకాహారిని. నాన్-వెజ్, డెయిరీ ఉత్పత్తులు తినను. అన్నంతో పాటు రకరకాల కూరగాయలు తింటాను. అంతే.. నా ఫుడ్ చాలా సింపుల్.

Samantha Akkineni

ఈ పరిస్థితుల్లో ప్రపంచం ఎలా మారుతోంది?
నేను గమనించింది ఏంటంటే.. ఈ పరిస్థితి చాలా కష్టం. అయితే ఎప్పుడైతే ఈ కరోనా వెళ్లిపోతుందో అప్పుడు నేను మెంటల్లీ స్ట్రాంగ్ గా మారుతానని అనిపిస్తోంది. అంతేకాదు.. నాలాగే చాలామంది స్ట్రాంగ్ గా మారుతారని అనుకుంటున్నాను.

లైఫ్ ను మెరుగ్గా చేసే 3 అలవాట్లు?
మంచి ఆహారం, యోగా, సింపుల్ రొటీన్ జీవితం.. లైఫ్ ను మెరుగ్గా ఉంచుతాయి.

రీసెంట్ గా ఆనందంతో కన్నీళ్లు వచ్చిన ఘటన?
జస్ట్ 3 రోజుల కిందటే ఆనందంతో కన్నీళ్లు వచ్చిన సంఘటన జరిగింది. నేను నటించిన ఫ్యామిలీ మేన్ రషెష్ చూశాను. ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి.

ఒత్తిడి నుంచి బయటపడ్డానికి ఏం చేస్తుంటారు?
మెడిటేషన్ చేస్తుంటాను. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇంకా ఎక్కువగా చేశాను. మనలో పాజిటివిటీ పెంచుతుంది. ఒక్కసారి చేస్తే మెడిటేషన్ అలవాటు అవ్వదు. అదే పనిగా చేస్తుండాలి. అప్పుడే దాని ఫలాలు దక్కుతాయి.

అభిమానులకు ఇచ్చే సందేశం?
నేను మీలో ఒక భాగం.. మీరు నాలో భాగం.. అంతే..

Advertisement
 

More

Related Stories