ఎగ‌తాళి చేసినోళ్లే ఫాలో అయ్యారు!

అస్మిత యూట్యూబ‌ర్ గా పాపులర్. ఆమె జర్నీ ఇప్పుడు ఒక సక్సెస్ స్టోరీ. యాష్ ట్రిక్స్ పేరుతో అస్మి త చేసిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. సీరియ‌ల్స్ లో, సినిమాల్లో న‌టిగా బిజీగా ఉన్న టైంలో వ‌చ్చిన ఆలోచ‌న ఆమెని ఇప్పుడు సోషల్ మీడియా క్వీన్ ని చేసింది.
మేక‌ప్ కిట్ లు ఎలా త‌యారు చేసుకోవాలి.. ఏ మెటీరియ‌ల్ ఎక్క‌డ దొరుకుతుంది వంటి వీడియోస్ తో పాటు అస్మిత చేసిన మోటివేష‌న‌ల్ వీడియోలు ఇప్పుడు అభిమానుల‌ను కుటుంబ స‌భ్యులుగా మార్చాయి. యాష్ ట్రిక్స్ ఇప్పుడు డిజిట‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారింది.

అస్మిత ఇప్పుడు ‘A1 from Day1’ అనే వెబ్ సిరీస్ ని రూపొందించారు.

“న‌టిగా బిజీ గా ఉన్న టైంలో డిజిట‌ల్ మీడియా వైపు నా అడుగులు పడ్డాయి. టివి సీరియ‌ల్స్ లో బిజీ గా ఉన్నాను. సినిమాల‌లో అవ‌కాశాలు బాగున్నాయి. ఇప్పుడు ఇదంతా ఏంటి అనే ప్ర‌శ్న‌లు తోటి న‌టీ న‌టుల నుండి వ‌చ్చాయి. దీన్ని ఎవ‌రు చూస్తారు అనే కామెంట్స్ కూడా విన్నాను. అయితే అప్పుడు న‌న్ను ఎగ‌తాళి చేసిన వారంద‌రూ త‌ర్వాత యూ ట్యూబ్ ఛానెల్స్ ని మొద‌లు పెట్ట‌డం నాకు ఆనందంగా ఉంది. యాష్ ట్రిక్స్ విజ‌యం వెనుక నా భ‌ర్త సుధీర్ స‌హాకారం చాలా ఉంది,” అన్నారు అస్మిత.

పెళ్ళి , పిల్ల‌ల‌తో మ‌హిళ ల కెరియ‌ర్ ఆగిపోతుందనే కాన్సెప్ట్ నాక‌స‌లు అర్దం కాదు. నేను న‌మ్మ‌ను.. అదే న‌మ్మ‌కంతో యాష్ ట్రిక్స్ ని మొద‌లు పెట్టాను. అస‌లు ఏలాంటి వీడియోలు చేయాలి అని మొద‌ట చాలా ఆలోచించే వాళ్ళం. మ‌న డైలీ రోటీన్ అవ‌స‌రం అయ్యే విష‌యాలే మా వీడియోస్ కి ముడి స‌ర‌కు చేసుకునే వాళ్ళం. ప్ర‌తి కామెంట్ ని చ‌దివే వాళ్లం వారికి రిప్లై ఇచ్చే వాళ్లం ఇప్పుడు యాష్ ట్రిక్స్ ఒక బ్రాండ్ గా మారిందంటే అది వ్యూవ‌ర్స్ కి మా మీద ఉన్న న‌మ్మ‌క‌మే కారణం. నిజాయితీగా ప్ర‌య‌త్నిస్తూ న‌మ్మ‌కాన్ని పొందాం. ఇప్పుడు యాష్ ట్రిక్స్ నుండి ఒక వెబ్ సిరీస్ ని విడుద‌ల చేస్తున్నాం. సుధీర్ , నేను భార్య భ‌ర్త‌లుగా న‌టిస్తున్న ఈ సిరీస్ లో క‌మెడియ‌న్ ఆలీ గారు ముఖ్య‌మైన పాత్ర‌ను పోషించారు. డిసెంబ‌ర్ 10న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దీనిని చూసేందుకు రూ. 59 ధ‌ర నిర్ణ‌యించాం. మా సిరీస్ కి స‌బ్ స్క్రిప్ష‌న్ మొద‌లు అయ్యింది. త‌ప్ప‌కుండా ఈ ప్ర‌య‌త్నం స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్మాము. ప్రివ్యూ త‌ర్వాత వ‌చ్చిన రెస్పాన్స్ చూస్తుంటే మా న‌మ్మ‌కం నిజం అయ్యింద‌నిపిస్తుంది,” అన్నారు.

“చిన్న టీం తో మొద‌లైన మా ప్ర‌య‌త్నం ఒక బ్రాండ్ గా మార‌డం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు A1 from Day1 వెబ్ సిరీస్ మొద‌లు పెట్టాల‌నే ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడు అవ‌కాశాలు కోసం ప్ర‌య‌త్నించాం.. కానీ అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించ‌డం కంటే వాటిని సృష్టించుకోవ‌డం మేలు అని గ్ర‌హించాం,” అన్నారు ద‌ర్శ‌కుడు, న‌టుడు సుధీర్.

Advertisement
 

More

Related Stories