మళ్ళీ ‘అతడు’ వైబ్స్!

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అతడు’ ఒక క్లాసిక్ అనిపించుకొంది. అప్పట్లో అది భారీ బ్లాక్ బస్టర్ కాదు కానీ ఆ తర్వాత బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా టీవీల్లో పెద్ద హిట్.

కమర్షియల్ ఎలెమెంట్స్, కామెడీ, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ అన్ని కలిసిన సూపర్ మూవీ… అతడు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో వేసిన ఒక హౌజ్ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ చూసిన వారు చెప్తున మాట మరో బ్లాక్ బాస్టర్ రెడీ అవుతోంది అని. ‘అతడు’, ‘అలా వైకుంఠపురంలో’కి మించి అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోందట.

పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల, మహేష్ బాబు లకి సంబంధించిన రొమాంటిక్ సీన్లు తీస్తున్నారు.

ఈ సినిమా టైటిల్ త్వరలోనే ప్రకటిస్తారు. ఈ ఉగాదికే ప్రకటన ఉంటుంది అని అభిమానులు చెప్తున్నారు. కానీ ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.

 

More

Related Stories