మొన్న త్రిష.. ఇప్పుడు అధర్వ

కోలీవుడ్ లో ఒకేసారి ఇద్దరు స్టార్స్ కు సంబంధించిన పెళ్లి కబుర్లు హైలెట్ అవుతున్నాయి. ప్రస్తుతం త్రిష పెళ్లిపై తమిళనాట ఫిలింసర్కిల్ లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరో అధర్వ కూడా చేరిపోయాడు.

అవును.. గోవాకు చెందిన ఓ అమ్మాయితో అధర్వ కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడట. వచ్చే ఏడాది జనవరిలో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడట. ఈ మేరకు కోలీవుడ్ మీడియా వరుసగా కథనాలు ప్రసారం చేస్తోంది.

రీసెంట్ గా అధర్వ అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. తమిళ స్టార్ హీరో విజయ్ మేనకోడలితో, అధర్వ అన్నయ్య పెళ్లి జరిగింది. అన్నయ్య పెళ్లి అయిపోవడంతో, ఇప్పుడు అధర్వ కూడా తన గర్ల్ ఫ్రెండ్ ను జీవిత భాగస్వామిగా చేసుకోవాలని అనుకుంటున్నాడట. తెలుగులో “గద్దలకొండ గణేష్” సినిమాలో నటించాడు అధర్వ.

Related Stories