థియేటర్లో కూడా చూపిస్తా: నాని

Nani

నాని-సుధీర్ బాబు నటించిన మల్టీస్టారర్ మూవీ “V” డైరక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 5న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. అయితే ఇక్కడితో కథ ముగియలేదు. ఎప్పుడు థియేటర్లు తెరిస్తే అప్పుడు ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పైకి కూడా రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా నాని బయటపెట్టాడు.

“సినిమాలో ఓ సందర్భానికి థియేటర్లలో ప్రేక్షకులు మూకుమ్మడిగా ఎలా స్పందిస్తారో చూడాలని అనుకున్నాం. షూటింగ్, డబ్బింగ్, రీ-రికార్డింగ్.. ఇలా వివిధ దశల్లో ఇదే ఆలోచించాం. ఒక విషయమైతే నేను కచ్చితంగా చెప్పగలను. ఓటీటీలో ఎవరైతే V సినిమాను ఇష్టపడతారో, వాళ్లంతా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం థియేటర్లలో మరోసారి ఈ సినిమా చూస్తారు.”

ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఫస్ట్ డే ఫస్ట్ షోను ఎక్స్ పీరియన్స్ చేయడం తనకు చాలా ఇష్టమంటున్న నాని.. ఈసారి మాత్రం దానికి భిన్నంగా స్ట్రీమింగ్ మొదలైన వెంటనే అర్థరాత్రి నుంచి కామెంట్స్ చదువుతానని ప్రకటించాడు. ఇదొక భిన్నమైన అనుభూతి అంటున్న నాని, పరిస్థితులకు తగ్గట్టు మారాల్సిందేనంటున్నాడు.

Related Stories