ఆడియో డిస్క్రిప్టివ్ తో ‘విధి’ మూవీ

Vidhi


రోహిత్ నందా, ఆనంది జంటగా రూపొందిన చిత్రం ‘విధి’. అన్నదమ్ములు శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ దర్శకులుగా మారి తీస్తున్న చిత్రం ఇది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో

“ఆడియో డిస్క్రిప్టివ్ టెక్నాలజీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. కంటి చూపు లేని వాళ్లు కూడా ఈ సినిమా అనుభూతి చెందగలరు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పది లక్షల మంది కంటి చూపు లేని వాళ్లున్నారు. వారికోసం ఈ సినిమాని చూపించబోతున్నాం, “అన్నారు హీరో రోహిత్ నంద.

“సినిమాల్లోకి రాక ముందు నేను మీడియాలో పని చేశాను. అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చాను,” అని అన్నారు దర్శకుడు, కెమెరామెన్ శ్రీనాథ్. “విధి మాకు మొదటి సినిమా. రైటింగ్ టైంలో మా బ్రదర్స్ ఇద్దరికీ గొడవలు వచ్చాయి. అన్నదమ్ములన్నాక గొడవలు సహజం. కానీ సెట్స్‌కి వచ్చాక అలాంటివేం జరగలేద’ని అన్నారు మరో దర్శకుడు శ్రీకాంత్.

“రోహిత్‌తో చాలా ఏళ్ల క్రితమే నటించాల్సింది. కానీ అప్పుడు మిస్ అయింది,” అన్నారు హీరోయిన్ ఆనంది.

Advertisement
 

More

Related Stories