శశి ప్రీతమ్ ‘లైఫ్ ఆఫ్ 3’ ఆడియో విడుదల

Sasi Preetam

ప్రముఖ సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా… ‘లైఫ్ ఆఫ్ 3’. ఆయన కుమార్తె ఐశ్వర్య కృష్ణప్రియ నిర్మించారు. దుష్యంత్ రెడ్డి సహ నిర్మాత. స్నేహాల్ కామత్, సంతోష్ అనంతరామన్, చిన్నికృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 15 (బుధవారం) శశి ప్రీతమ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్, ఆడియో విడుదల చేశారు.

సినిమాలో పాటలన్నీ శశి ప్రీతమ్ రాశారు.

“ఈ ఏడాది జనవరిలో ‘లైఫ్ ఆఫ్ 3’ సినిమా ప్రారంభించాం. గతేడాది తీవ్ర గుండెపోటుకు గురైనప్పుడు చావును దగ్గరనుంచి చూశా. దాన్నుంచి చాలా నేర్చుకున్నాను. చివరి క్షణం వరకూ పోరాటం చేయడం ఆపవద్దు, నెవర్ గివ్ అప్ అనే సందేశాన్ని ఈ సినిమా ఇస్తుంది.”అని అన్నారు శశి ప్రీతమ్.

“మా సినిమాలో చాలామంది కొత్త నటీనటులు ఉన్నారు. పాటల  ద్వారా చాలామంది కొత్త గాయనీగాయకులను కూడా పరిచయం చేశాం. కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వగలిగినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా నిర్మించిన మా అమ్మాయి ఐశ్వర్యకు, ఆమెకు మద్దతుగా నిలిచిన దుష్యంత్ రెడ్డి గారికి థాంక్స్,” అని అన్నారు.

 

More

Related Stories