‘నేను స్టూడెంట్ సర్’ అవంతిక ముచ్చట్లు

Avantika Dassani

బెల్లంకొండ గణేష్ నటించిన రెండో చిత్రం… ‘నేను స్టూడెంట్ సర్’. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం ఒక హైలెట్. ఆమెకిదే మొదటి చిత్రం. జూన్ 2న విడుదల కానున్న ఈ సినిమా గురించి ఈ బ్యూటీ చెప్పిన ముచ్చట్లు.

ఓటిటి నుంచి సినిమాలకు …

“నేను మొదట మోడలింగ్ చేశా. ఆ తర్వాత “మిథ్యా” అనే జీ5 ఓటీటీకి కోసం తీసిన వెబ్ సిరీస్ లో నటించాను. నటిగా అదే మొదటి ప్రయత్నం. ఆ తర్వాత ఒక హిందీ సినిమా కూడా ఒప్పుకున్నాను. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో మా అమ్మ భాగ్యశ్రీ బెల్లంకొండ శ్రీనివాస్ కి తల్లిగా నటించారు. ఆ టైంలో నాకు శ్రీనివాస్ ద్వారా ఈ మూవీ అవకాశం వచ్చింది.”

‘నేను స్టూడెంట్ సర్’లో స్టూడెంట్ గా

“నేను ఈ సినిమాలో శృతి అనే పాత్రలో నటించాను. స్టూడెంట్ ని. కథలో చాలా మలుపులు ఉంటాయి. అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది.”

Avantika Dassani

తెలుగు చిత్రసీమ

మా అమ్మకి సౌత్ ఇండస్ట్రీ అంటే ఇష్టం. నాకు కూడా ఇక్కడి పద్ధతులు, ప్రొఫెషనలిజం నచ్చింది. చాలా నేర్చుకున్నాను. నేను ఎక్కువగా తెలుగు సినిమాలు చూడలేదు కానీ రీసెంట్ గా “పుష్ప”, “అల వైకుంఠపురములో” చిత్రాలు చూశాను. అల్లు అర్జున్ నటన నచ్చింది. హీరోయిన్లలో సమంత, నయనతార ఇష్టం.

Advertisement
 

More

Related Stories