500 మిలియన్ల దిశగా

Avatar 2


జేమ్స్ కామెరూన్ తీసిన ‘అవతార్ 2’ బోర్ అన్నారు. ఫ్లాప్ అని ప్రకటించారు. అమెరికాలో పెద్దగా ఆడదు అనే మాట కూడా వినిపించింది. ఇదంతా డిసెంబర్ 16న ‘అవతార్ 2’ విడుదలైన తొలి రోజుల్లో ఏర్పడ్డ అభిప్రాయం. ఇప్పుడు సీన్ మొత్తం మారింది. అమెరికాలో హాలిడే సీజన్ కూడా ముగిసింది. అయినా… అవతార్ 2 కలెక్షన్లు తగ్గలేదు.

నిన్న కూడా ఈ సినిమా అమెరికాలో 10 మిలియన్ల డాలర్లను లాగేసింది. ఇప్పటివరకు 460 మిలియన్ డాలర్లు పొందింది. ఈ వీకెండ్ తర్వాత 500 మిలియన్ డాలర్లు ఆపై వసూళ్లు పొందిన సినిమాల జాబితాలో చేరుతుంది. అంటే, ఇది అమెరికాలో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జనవరి నెల అంతా ఆడే అవకాశం ఉంది.

ఇక భారత్ సహా ఇతర దేశాల్లో కూడా సినిమా దుమ్ము రేపింది. అమెరికా మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు 1 బిలియన్ (వెయ్యి మిలియన్) డాలర్లను కొల్లగొట్టింది. ఓవరాల్ గా 1.46 బిలియన్ డాలర్ల వసూళ్లు అందుకొంది. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే 12 వేల కోట్ల రూపాయలు.

జేమ్స్ కామెరూన్ ఇక అవతార్ 3, అవతార్ 4 సినిమాలపై ఫోకస్ పెడుతారు.

Advertisement
 

More

Related Stories