పెళ్ళికి డేట్ అనుకోలేదు!

- Advertisement -

ఇతనే నా కాబోయే భర్త అంటూ కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అవికా గోర్. మిలింద్ అనే అతనితో ప్రేమలో పడిన తర్వాతే కష్టపడి లావు తగ్గింది. ఇప్పుడు యమా స్లిమ్ గా ఉంది. అలాగే, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ బిజిగా మారింది. అందులో నటిస్తోంది.

మరి ప్రియుడు మిలింద్ తో పెళ్లి ఎప్పుడు అని అడిగితే… ఇప్పుడే కాదు అని చెప్తోంది. పెళ్ళికి డేట్ ఫిక్స్ చేసుకోలేదంట. ఈ ఏడాది ఉండదు అని మాత్రం హింట్ ఇచ్చింది.

‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్తా మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి సినిమాల్లో నటించిన అవికా గోర్ తెలుగులో మళ్ళీ నటించేందుకు పెద్దగా ప్రయత్నాలు చెయ్యడం లేదు.

 

More

Related Stories