నిర్మాతగా మారిన అవికా

నిర్మాతగా మారిన అవికా

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో పరిచయమైంది. ‘ఉయ్యాలా జంపాలా’తో హీరోయిన్ అయింది. ,సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి సినిమాలతో హీరోయిన్ గా తనకంటూ క్రేజ్ తెచ్చుకొంది అవికా గోర్. ఐతే, ఆ తర్వాత శరీరం అదుపు తప్పింది, బాగా లావుగా మారింది. దాంతో అవకాశాలు ఆవిరయ్యాయి. కెరీర్ ని చక్కదిద్దుకునేందుకు చాలా కష్టపడి బాగా సన్నబడింది. ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ గా బిజీ అవుతోంది. అంతేకాదు ఇప్పుడు నిర్మాత అవతారం కూడా ఎత్తింది.

అవికా స్క్రీన్ క్రియేషన్స్ పేరుతో ఆమె ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది. ‘నెపోలియన్’ అనే సినిమాని నిర్మించిన నిర్మాత భోగేంద్ర గుప్తా మడుపల్లి తాజాగా మరో కొత్త చిత్రానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఆయన నిర్మిస్తున్న సినిమాతో అవికా చేతులు కలిపింది.

ఆచార్య క్రియేషన్స్‌, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఈ కొత్త సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో అవికా గోర్ హీరోయిన్. సాయి రోనక్ హీరో. యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వం వహించనున్నారు.

More

Related Stories