ఈ వీకెండ్ అవుట్ అయ్యేది ఎవరు?

- Advertisement -

గత వీకెండ్ ఎవరిని ఎలిమినేట్ చెయ్యకుండా…. నాగార్జున పాస్ చేశాడు. ఈ వీకెండ్ కంపల్సరీగా ఎవరిని ఒకరిని పంపించాల్సిందే. ఎందుకంటే.. బిగ్ బాస్ తెలుగు 4 కార్యక్రమం చివరి రౌండుకి చేరుకొంది. మరో 15 రోజుల్లో ఎండ్ అవుతుంది. మరి ఈ వీకెండ్ ఎవరు ఇంటిబాట పడుతారు?

అఖిల్, అవినాష్ … వోటింగ్ లో వెనుకబడి ఉన్నారు అనేది గూగుల్ ట్రెండ్స్ చెప్తోంది. అవినాష్ జబర్దస్త్ కార్యక్రం వదులుకొని మరి ఈ షోలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చాడు. మరి అతన్ని చివరివరకు ఉంచకుండా ముందే పంపిస్తారా? లేక ఎలాగైనా కాపాడుతారా? ఎందుకంటే… అనేకసార్లు వోటింగ్ లో వెనుకబడ్డా, ఎలిమినేషన్ కి నామినేట్ అయినా కూడా మోనాల్ పై వేటు పడలేదు. సో… ఇప్పుడు అవినాష్ విషయంలో అదే జరుగుతుందా?

అఖిల్ కి కూడా ఛాన్స్ ఉంది. మొత్తమ్మీద, చివరి నిమిషంలో ఏదైనా మిరాకల్ జరిగితే తప్ప ఈ వీకెండ్ అఖిల్, అవినాష్ లలో ఎవరో ఒకరు బయటికి వెళ్ళాలి.

 

More

Related Stories