బిగ్ బాస్ కి వెళ్లాలంటే 10 లక్షలు ఇవ్వాలా?

Jabardasth Avinash

అవినాష్ ….జబర్దస్త్ టీంలో ఒక మెంబర్. చాలా కాలంగా ఆ ప్రోగ్రాంలో నటిస్తున్నాడు. “బిగ్ బాస్ తెలుగు 4” షోలో చెయ్యాల్సిందిగా అఫర్ వచ్చినప్పుడు అవినాష్ ఎగిరి గంతేశాడు. కానీ బిగ్ బాస్ కి వెళ్లాలంటే అవినాష్ కి ఎన్నో ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. ముందుగా… జబర్దస్త్ షో మేనేజిమెంట్ ఒప్పుకోలేదు. మాకు అగ్రిమెంట్ రాసి ఉన్నావు..అని ఒక పేపర్ చూపించి అడ్డుకున్నారట.

అది లీగల్ గా చెల్లుతుందా లేదా అన్నది వేరే మేటర్. కానీ అక్కడ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకోకుండా వచ్చేందుకు బిగ్ బాస్ టీం కూడా ఒప్పుకోదు. దాంతో అవినాష్ … “జబర్ దస్త్” బాస్ ని ఎన్నో విధాలుగా రిక్వెస్ట్ చేసినా కుదరలేదు. కంపల్సరీగా అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకోవాలంటే… 10 లక్షలు మాకు కట్టాలి అని “జబర్ దస్త్” మేనేజిమెంట్ అడిగిందిట. దాంతో… అవినాష్ కిందా మీదా పడ్డాడు. లీగల్ గా పోరాడుదామనుకున్నాడట. కానీ కేసు ఇప్పట్లో తేలాడు… బిగ్ బాస్ మిస్ అవుతుంది. దాంతో ఎలాగోలా సర్ది 10 లక్షలు కట్టాడు “జబర్దస్త్” టీంకి.

దాంతో అవినాష్ ఎంట్రీ బిగ్ బాస్ లో ఆలస్యం అయింది. లేదంటే… మొదటి 16 మంది కంటెస్టెంట్ లలోనే ఉండేవాడు. మొత్తానికి బిగ్ బాస్ కి వెళ్లాలంటే అవినాష్ కి 10 లక్షలు ఖర్చు అయ్యాయి.

Related Stories