
బిగ్ బాస్ షోలో అదరగొట్టిన కమెడియన్ అవినాష్ దశ తిరిగింది. అతనే ప్రధాన ఆటగాడిగా “కామెడీ స్టార్స్” అనే కొత్త షో స్టార్ట్ చేసింది స్టార్ మా ఛానెల్.
“బిగ్ బాస్ షో”లో పాల్గొనకముందు “జబర్దస్త్” షోలో కమెడియన్లలో ఒకరిగా ఉండేవాడు అవినాష్. బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు జబర్దస్త్ మేకర్స్ ఒప్పుకోలేదు. దాంతో వారితో గొడవపడి బయటికి వచ్చాడు. ఐతే పది లక్షల పరిహారం చెల్లిస్తే కానీ షో నుంచి బయటికి వెళ్లనివ్వమని జబర్దస్త్ టీం పేచీ పెట్టింది. దాంతో 10 లక్షలు అప్పు చేసి, వారికి చెల్లించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో జాయిన్ అయ్యాడు.
అవినాష్ బాగా ఆడాడు. కానీ టాప్ 5లోకి రాలేదు. ఐతే, స్టార్ మా ఛానెల్ మాత్రం అతనికి న్యాయం చేసింది. “కామెడీ స్టార్స్” షోని రూపకల్పన చేసి జబర్దస్త్ కి పోటీగా నిలిపింది. జబర్దస్త్ కమెడియన్ ఇప్పుడు ఆ షోకి వ్యతిరేకంగా డిజైన్ చేసిన షోలో మెయిన్ రోల్ చేస్తున్నాడు.
‘బిగ్ బాస్’ కోసం చేసిన అప్పు ఇప్పటికే తీరింది. ఇప్పుడు ఈ షోతో భారీగా సంపాదిస్తాడు.