అయేషాకి తెలుగులో మంచి ఆఫర్లే

Ayesha Khan

ఈ రోజు విడుదలైన “ఓం భీం బుష్” సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో ఎక్కువగా ఆకట్టుకున్నది అయేషా ఖాన్. అందాల ఆరబోతతో పాటు అట్రాక్టివ్ ఫేస్ తో ఆమె ఆకర్షించింది.

ఐతే, ఈ భామ ఈ సినిమా కన్నా ముందే తెలుగులో బిజీ అయింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్నటిస్తున్న “లక్కీ భాస్కర్” చిత్రంలో ఈ అమ్మడు ఒక కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే విశ్వక్ సేన్ నటించిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”లో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా మే 17న విడుదల కానుంది. ఇంకా పేరు పెట్టని మరో చిన్న చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తోంది.

హిందీ బిగ్ బాస్ సీజన్ 17లో కనిపించి పాపులర్ అయింది అయేషా. అలాగే “కసౌటి జిందగీ కే” అనే టీవీ సీరియల్ లో కూడా నటించింది. తెలుగులో ఇంతకుముందు “ముఖ చిత్రం” అనే సినిమాలో నటించింది.

ఈ భామని ఇప్పుడు సెక్సీ పాత్రలకు, ఐటెం సాంగ్ లకు తీసుకుంటున్నారు మన తెలుగు మేకర్స్.

Advertisement
 

More

Related Stories