“విక్రమ్ వేద”….. అప్పుడెప్పుడో మూడేళ్ల కిందటొచ్చిన తమిళ సినిమా. అది తమిళ్ లో హిట్టవ్వడమే ఆలస్యం, తెలుగులో దాని రీమేక్ అంటూ ప్రచారం జరిగింది. దాదాపు రెండేళ్లుగా ఆ రీమేక్ ప్రచారం టాలీవుడ్ లో జరిగింది. విచిత్రమేంటంటే… ఏమి న్యూస్ లేనప్పుడు ఓల్డ్ ఫోల్డర్ నుంచి ఇప్పటికీ విక్రమ్ వేద కథనాలు వండి వార్చుతూనే ఉంటారు. ఇప్పుడీ ప్రాజెక్టుకు ఏమాత్రం తీసిపోదు “అయ్యప్పన్ కోషియమ్” సినిమా.
మలయాళంలో హిట్టయిన సినిమా ఇది. దీన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తెగ ట్రై చేస్తోంది. రానా ప్రస్తుతానికి ఓకే అన్నాడు. మరో హీరో కోసం సెర్చింగ్. ముందుగా వెంకీ అనుకున్నారు. ఆ తర్వాత బాలయ్య అనుకున్నారు, తాజాగా ఇప్పుడు రవితేజ పేరు తెరపైకొచ్చింది.
ఇలా హీరోల పేర్లు మారుతున్నాయి కానీ ప్రాజెక్టు మాత్రం ఫైనలైజ్ అవ్వడం లేదు. దీంతో ఇది మరో “విక్రమ్ వేద” అయ్యేలా ఉందంటూ టాలీవుడ్ లో జోకులు పేలుతున్నాయి.