మాహిష్మతిలో మాస్కుల గోల

Baahubali fight with masks
Baahubali epic fight scene, now with Masks

ప్రపంచదేశాల్ని వణికిస్తున్న కరోనా ఇప్పుడు ఏ స్థాయికి చేరిందంటే.. మాస్క్ లేకుండా బయట అడుగుపెట్టడం దుర్లభంగా మారింది. చివరికి అది మాహిష్మతి రాజ్యమైనా మాస్క్ తప్పనిసరి అంటున్నాడు దర్శకుడు రాజమౌళి.

అవును.. తను సృష్టించిన మాహిష్మతి రాజ్యంలోకి కూడా మాస్కులు వచ్చేశాయంటున్నాడు జక్కన్న. ఈ మేరకు “బాహుబలి-2” సినిమా నుంచి ఓ చిన్న క్లిప్ కూడా రిలీజ్ చేశాడు. క్లైమాక్స్ లో రానా, ప్రభాస్ ఒకరినొకరు తలపడే ఎపిసోడ్ లో ఓ చిన్న సీన్ ను తీసుకొని, వాళ్లిద్దరూ మాస్కులు ధరించినట్టు గ్రాఫిక్ చేశారు.

ఆ గ్రాఫిక్ వీడియోను షేర్ చేసిన రాజమౌళి.. అందరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని పిలుపునిచ్చాడు. మాహిష్మతి రాజ్యమైనప్పటికీ మాస్కులు తప్పనిసరి అనే సందేశంతో ఈ వీడియోను తయారుచేశారు.

 

More

Related Stories