థియేటర్లకు బాహుబలినే గతి!

Baahubali

కొత్త సినిమాలు విడుదల కావట్లేదు. దాంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో, నగరాల్లో ఇటీవల రి ఓపెన్ ఐన థియేటర్లకి సినిమాల సమస్య వచ్చి పడింది. ఈ థియేటర్లకి “ఫీడ్” ఇచ్చేందుకు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నడుముకట్టాడు. “బాహుబలి 1 &2” సినిమాలు ఈ వారం నుంచి థియేటర్లో ఆడుతాయి. మొదటి భాగం ఈ వీకెండ్, రెండో భాగం వచ్చే వీకెండ్ థియేటర్లోకి వస్తాయి అని కరణ్ ట్వీట్ చేశాడు.

బాహుబలి హిందీ వర్షన్ థియేట్రికల్ హక్కులు ఆయన వద్దే ఉన్నాయి. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. కొత్త సినిమాలు అన్ని ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతికి గాని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేలా లేవు. దాంతో రి-ఓపెన్ అయిన మల్టీప్లెక్స్లు సినిమాలు లేక ఈగలు తోలుకుంటున్నాయి.

బాహుబలి సినిమాలని ఇప్పటికే జనం అనేకసార్లు టీవీల్లో, థియేటర్లో, ఓటిటిల్లో చూశారు. మళ్ళీ థియేటర్లో ఈ సినిమాని ఈ కరోనా కాలంలో చూస్తారా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.

Related Stories