‘బాహుబలి’ సిరీస్ కి కొత్త దర్శకుడు

బాహుబలి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ సినిమాల ఆధారంగా ఆనంద్ నీలకంఠన్ అనే నవల రచయిత ఇంగ్లీష్ లో “ది రైజ్ అఫ్ శివగామి” అనే బుక్ రాశాడు. శివగామి (సినిమాలో ఈ పాత్రని రమ్యకృష్ణ పోషించారు) బాల్యం, ఆమె యవ్వనం ఎలా ఉందో, ఆమె పవర్పుల్ రాణిగా ఎలా మారారో తనదైన ఊహాశక్తితో రాశారు ఆనంద్ నీలకంఠన్.

ఈ బుక్ ఆధారంగా నెట్ ఫ్లిక్ స్ట్రీమింగ్ కంపెనీ “బాహుబలి” వెబ్ సిరీస్ ని అనౌన్స్ చేసింది. “బాహుబలి:బిఫోర్ ది బిగినింగ్” పేరుతో రెండు సీజన్లు లక్ష్యంతో భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేసింది. రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణలో తెలుగు దర్శకులు దేవ కట్టా, ప్రవీణ్ సత్తారుకి ఈ సిరీస్ అప్పగించారు.

వాళ్ళు తమ శైలిలో ఏడాదిన్నర పాటు చిత్రీకరించారు. ఎందుకో నెట్ ఫ్లిక్స్ కి వాళ్ళ వర్క్ నచ్చలేదు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఈ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తే…. ఆ రేంజులో రాలేదట. దాంతో ఇప్పటివరకు తీసిందంతా పక్కనపెట్టారు.

విశ్వేష్ కృష్ణమూర్తి అనే ఒక బాలీవుడ్ దర్శకుడికి ఇప్పుడు బాధ్యతలు అప్పగించారు. అతను మళ్ళీ ఫ్రెష్ గా స్క్రీన్ ప్లే రాసి… షూట్ చేస్తాడట.

రమ్యకృష్ణ పోషించిన పాత్రకి మృణాల్ ఠాకూర్ అనే బాలీవుడ్ నటిని తీసుకున్నారు. ఆమెని కూడా ఇప్పుడు మారుస్తారట. మొత్తంగా మళ్ళీ కొత్తగా తీయాల్సిందే.

Advertisement
 

More

Related Stories