బాహుబలి 100 కోట్లు చెత్తబుట్టలో

“బాహుబలి 1”, “బాహుబలి 2” సినిమాలు ప్రపంచవ్యాప్తంగా బాక్సాపీస్ వద్ద సంచలనం సృష్టించాయి. వందల కోట్లు కొల్లగొట్టాయి. ఒక్క బాహుబలి 2 సినిమానే దాదాపు 2000 కోట్ల రూపాయల వసూళ్ళు అందుకొంది. దాంతో బాహుబలి బ్రాండ్ నేమ్ ని మరింతగా ముందుకుతీసుకెళ్ళాలి అని భావించింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. 100 కోట్లు బడ్జెట్ ఇచ్చి… బాహుబలి సిరీస్ తీయమని చెప్పింది.

రాజమౌళి సూపర్ విజన్ లో దర్శకులు ప్రవీణ్ సత్తారు, దేవా కట్టా ‘ది బిగినింగ్ అఫ్ బాహుబలి ది బిగినింగ్’ అనే పేరుతో వెబ్ సిరీస్ తీశారు. ఐతే, వీళ్ళు తీసిన అవుట్ ఫుట్ నెట్ ఫ్లిక్స్ కి నచ్చలేదు. దాంతో ఆ మొత్తం 100 కోట్ల బడ్జెట్ తో తీసిన వెబ్ సిరీస్ ని డస్ట్ బిన్ లో వేసింది.

ఇప్పుడు కొత్తగా వేరే టీంతో అదే సిరీస్ ని నిర్మిస్తోంది. మళ్ళీ కొత్తగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించింది. అంటే ఈ ఒక్క సిరీస్ మీదే నెట్ ఫ్లిక్స్ ఏకంగా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. అది నెట్ ఫ్లిక్స్ రేంజ్.

More

Related Stories