రాధేశ్యామ్ పై ‘బాబు’ సెటైర్

Radhe Shyam Release Trailer

ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రూపొందిన ‘రాధేశ్యామ్’ సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ఘోరమైన పరాజయం పొందింది. ఈ సినిమాపై తాజాగా ప్రముఖ హేతువాది బాబు గోగినేని మంచి సెటైర్ వేశారు.

“బుద్ది ఉన్నోడు ఎవడైనా వాట్సాప్ మెసేజ్ లు చూసి సినిమా డైలాగులు రాస్తాడా? సినిమా తుస్ అంటగా.. సినిమా తీసే ముందే విక్రమాదిత్యతో జాతకం చూపించుకోవాల్సింది.” అని ఆయన రాధేశ్యామ్ సినిమాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య అనే జ్యోతిష్కుడిగా నటించారు. విక్రమాదిత్య చేతి చూసి జాతకం చెప్తే అది 100% నిజం అవుతుంది. సినిమా తీసేముందే విక్రమాదిత్యతో తమ సినిమా ఫలితం ఎలా ఉంటుందో జాతకం చెప్పించుకోవాల్సింది అని బాబు గోగినేని అంటున్నారు.

మూఢనమ్మకాలు, జాతకాలు వంటివి వాటికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తున్నారు.

 

More

Related Stories