గుడ్ బ్యాడ్ లక్ సఖి!

- Advertisement -
Keerthy Suresh

కీర్తి సురేష్ నటించిన మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ… “గుడ్ లక్ సఖి”. సినిమా పేరులో గుడ్ లక్ ఉంది. కానీ ఈ సినిమా నుంచి ‘బ్యాడ్ లక్ సఖి’ అంటూ ఒక పాట వచ్చింది. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటలో సఖి వల్ల ఊరికి ఎంత బ్యాడ్ జరిగిందో, ఆమె శకునం ఎలాంటిదో సరదాగా చూపించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది.

ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో కనిపిస్తారు.

బాలీవుడ్ లో ఎన్నో మంచి చిత్రాలు తీసిన నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన మొదటి తెలుగు సినిమా ఇది. ఆయన హైదరాబాద్ కి చెందిన వారే. ఈ సినిమాలో సహ నిర్మాత శ్రావ్య వర్మ సహా ఆడవాళ్లే ఎక్కువగా వర్క్ చేశారు.

దిల్‌రాజు సమర్పణలో సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు ఈ మూవీని. . చిరంతాన్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌. నవంబర్ 26న ఈ చిత్రం విడుదల కానుంది.

 

More

Related Stories